ఎస్వీయూలో సెమీ క్రిస్మస్‌ వేడుకలపై వివాదం

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సోమవారం సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Published : 19 Dec 2023 06:31 IST

ఎస్వీయూ(తిరుపతి), న్యూస్‌టుడే: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సోమవారం సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కార్యక్రమానికి వర్సిటీ ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వగా, ఆర్ట్స్‌ బ్లాక్‌ ఆడిటోరియంలో పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొని క్రైస్తవ  మత ప్రార్థనలు నిర్వహించారు. గతంలో ఎప్పుడూ ఎస్వీయూలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు జరపలేదని, ఈసారి ఉన్నతాధికారులు ఎలా అనుమతించారని ఆచార్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని