AP CID-TDP: ఒక్క పోస్టు పెడితే 100 ప్రశ్నలు వేశారు

సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారంటూ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ పెట్టిన కేసులో తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవలను సీఐడీ పోలీసులు శుక్రవారం విచారించారు.

Updated : 20 Jan 2024 10:15 IST

బ్యాంకు ఖాతాల తనిఖీ.. ఫోన్ల జప్తు
తెదేపా నేతలను విచారించిన సీఐడీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారంటూ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ పెట్టిన కేసులో తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవలను సీఐడీ పోలీసులు శుక్రవారం విచారించారు. న్యాయవాదులు రాజీవ్‌ ఆనంద్‌, రవీంద్రబాబులతో కలిసి ఉదయం 10 గంటలకు నేతలు కార్యాలయంలోకి వెళ్లారు. తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, మైనారిటీసెల్‌ నాయకుడు కేఎంఈ హుస్సేన్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. సాయంత్రం 5గంటలకు సీఐడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి విలేకర్లతో మాట్లాడుతూ..‘ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారనే అభియోగంతో వంద ప్రశ్నలు అడిగారు. కుటుంబసభ్యుల వ్యక్తిగత వివరాలు అడిగి బెదిరించారు. లోకేశ్‌ ఆదేశిస్తే పోస్టు పెట్టారా? అని అడిగారు. మేము పెట్టలేదని, ఎవరో తయారుచేసిన పోస్టును మా ఎఫ్‌బీ ఐడీ ద్వారా ఉద్దేశపూర్వకంగా ఫార్వర్డ్‌ చేసి ఉంటారని తెలిపాం. అయినా వినకుండా ఆ పోస్టు పెట్టడానికి ఎవరైనా డబ్బులు ఇచ్చారా అంటూ మా బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. మా ఫోన్లు జప్తు చేశారు. ఈ నెల 30న మళ్లీ విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని