ఉద్యోగి పక్కనే పడుకుని కాపలా

ఉమ్మడి కర్నూలు జిల్లాలో విద్యుత్తు శాఖ ఉద్యోగులు పలువురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఈ నెల 12న (సోమవారం) చలో విజయవాడ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Published : 12 Feb 2024 05:00 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో విద్యుత్తు శాఖ ఉద్యోగులు పలువురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఈ నెల 12న (సోమవారం) చలో విజయవాడ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 మందిని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆస్పరి కార్యాలయంలో భీమేశ్‌ అనే ఉద్యోగి పోలీస్‌స్టేషన్‌కు రాలేనని చెప్పడంతో ఓ పోలీస్‌ ఆయన పక్కనే నిద్రించి కాపలా కాశారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు తెలిపారు. ఉద్యోగులపై పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని