ఒడిశాలో ఏపీ లారీలకు జరిమానాలు

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘వాహన్‌’ పోర్టల్‌లో ఏపీ లారీలకు చెందిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, పర్మిట్ల వివరాలు సకాలంలో అప్‌లోడ్‌ కావడం లేదని ఏపీ లారీ యజమానుల సంఘం నాయకులు తెలిపారు.

Updated : 23 Feb 2024 04:46 IST

‘వాహన్‌’ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్‌ కాక ఇబ్బందులు
సమస్య పరిష్కరించాలని లారీ యజమానుల సంఘం వినతి

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘వాహన్‌’ పోర్టల్‌లో ఏపీ లారీలకు చెందిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, పర్మిట్ల వివరాలు సకాలంలో అప్‌లోడ్‌ కావడం లేదని ఏపీ లారీ యజమానుల సంఘం నాయకులు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర లారీలు ఒడిశా వెళ్తే అక్కడ భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ రవాణాశాఖకు చెందిన వివరాలన్నీ ఎన్‌ఐసీ ద్వారా కొంత ఆలస్యంగా అప్‌లోడ్‌ చేస్తుండటమే దీనికి కారణమన్నారు. ఇప్పటికే వందల లారీలపై ఒడిశా అధికారులు చలానాలు విధించారని సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. ఏపీ రవాణాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని, ఆ రవాణాశాఖ నమోదు చేసిన కేసులు రద్దు చేయించేలా చూడాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని