వాలంటీర్లకు ఉచిత బీమా ఎర!

ఎన్నికల వేళ అధికార పార్టీ నాయకులు వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు వారిపై వరాలు కురిపిస్తున్నారు.

Published : 23 Feb 2024 04:36 IST

కురిచేడు, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ అధికార పార్టీ నాయకులు వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు వారిపై వరాలు కురిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో గురువారం ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఆమె కుమారుడు, వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి శివప్రసాదరెడ్డి మాట్లాడారు. మండలంలోని 209 మంది వాలంటీర్లకు బూచేపల్లి సుబ్బారెడ్డి-వెంకాయమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమాను ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐదుగురు వాలంటీర్లకు సేవారత్న అవార్డులు అందజేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.10లక్షల విలువైన వైద్య పరికరాలను ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని