Vizag: మేయర్‌ కారైతే ఏంటి.. కల్వర్టుకు తెలియదు కదా!

కల్వర్టు పునరుద్ధరణ పనుల ప్రారంభానికి వచ్చిన ప్రజాప్రతినిధి కారు.. ఆ శిథిలాల్లోనే ఇరుక్కుపోయింది. విశాఖపట్నంలోని 65వ వార్డు కాకతీయ కూడలి సమీపంలో పనుల శంకుస్థాపనకు శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, మేయర్‌ జి.హరి వెంకటకుమారి, ఇతర అధికారులు, నాయకులు వచ్చారు.

Updated : 24 Feb 2024 07:29 IST

గాజువాక, న్యూస్‌టుడే: కల్వర్టు పునరుద్ధరణ పనుల ప్రారంభానికి వచ్చిన ప్రజాప్రతినిధి కారు.. ఆ శిథిలాల్లోనే ఇరుక్కుపోయింది. విశాఖపట్నంలోని 65వ వార్డు కాకతీయ కూడలి సమీపంలో పనుల శంకుస్థాపనకు శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, మేయర్‌ జి.హరి వెంకటకుమారి, ఇతర అధికారులు, నాయకులు వచ్చారు. మేయర్‌ కారు దిగి కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లారు. డ్రైవర్‌ కల్వర్టుపైనున్న వాహనాన్ని వెనక్కి తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కల్వర్టుపై మ్యాన్‌హోల్‌లా ఉన్న గుంతలో కారు ముందు చక్రం ఇరుక్కుపోయింది. గుంతపై ఉన్న మూత శిథిలమైపోవడంతో చక్రం పూర్తిగా అందులో దిగబడింది. అప్రమత్తమైన జీవీఎంసీ సిబ్బంది, స్థానికులు అతికష్టం మీద వాహనాన్ని అందులోంచి లాగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని