మొదటిరోజు సజావుగా ముగిసిన టెట్‌

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) మొదటిరోజు సజావుగా ముగిసిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

Published : 28 Feb 2024 04:09 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) మొదటిరోజు సజావుగా ముగిసిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. పేపర్‌-1 పరీక్షకు ఉదయం 86.37 శాతం, మధ్యాహ్నం 87.54 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల పేరు, వివరాలు తప్పుగా నమోదైతే ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించాలి. వివరాలు సరైనవని అధికారులు నిర్ధారిస్తే అభ్యర్థులు రాష్ట్రస్థాయిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూముకి తెలియజేయాలి. మరో సెషన్‌లో పరీక్షకు హాజరయ్యేలా బఫర్‌ హాల్‌టికెట్‌ అందిస్తాం. కోర్టు ఉత్తర్వుల వల్ల పరీక్ష రాయలేని అభ్యర్థులకు ఫీజు తిరిగి చెల్లిస్తాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు