గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో కుట్ర కోణం

‘గ్రూప్‌-1 పరీక్ష శాస్త్రీయంగా, సమర్థంగా నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. సాక్షి పత్రికలో సవాంగ్‌ పేరిట కథనం మేరకు అభ్యర్థులు కొత్త సిలబస్‌తో పరీక్షకు సిద్ధమయ్యారు.

Published : 01 Mar 2024 04:36 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ‘గ్రూప్‌-1 పరీక్ష శాస్త్రీయంగా, సమర్థంగా నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. సాక్షి పత్రికలో సవాంగ్‌ పేరిట కథనం మేరకు అభ్యర్థులు కొత్త సిలబస్‌తో పరీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పుడు పాత సిలబస్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇందులో కుట్ర కోణం దాగి ఉంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పాత సిలబస్‌ ప్రకారం పరీక్ష ఉంటుందని ప్రభుత్వం తన అనుయాయులకు ముందే చెప్పి.. ఇప్పుడు బహిరంగంగా ప్రకటించి కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. గురువారం విజయవాడలో రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఈ అంశంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాత సిలబస్‌ ప్రకారమే పరీక్ష నిర్వహించాలనుకుంటే.. పరీక్షకు మరో మూడు నెలల సమయం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్‌ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేశారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని