‘జగన్‌కు, పార్టీకి అనుకూలంగా లేనివాళ్లను పీకేస్తాం’

జగన్‌కు, పార్టీకి, తనకు అనుకూలంగా లేని వాలంటీర్లను పీకేస్తామని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

Published : 02 Mar 2024 05:37 IST

వాలంటీర్లకు మాజీ మంత్రి ముత్తంశెట్టి హెచ్చరిక

విశాఖపట్నం (తగరపువలస), న్యూస్‌టుడే: జగన్‌కు, పార్టీకి, తనకు అనుకూలంగా లేని వాలంటీర్లను పీకేస్తామని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాళ్లవలసలో నిర్వహించిన సభలో ఎంపీడీవో జానకిని ఉద్దేశించి ‘11 మంది వాలంటీర్లు రాలేదు మేడం చూడండి. తప్పనిసరిగా రావాలని.. లేకుంటే పీకేస్తామని చెప్పండి’ అని పేర్కొన్నారు. తాను వెళ్లబోయే తర్వాత గ్రామంలో వాలంటీర్లంతా హాజరు కావాలని ఆదేశించారు. అదే వేదికపై ఉన్న ఎంపీపీ వాసురాజు, జడ్పీటీసీ సభ్యుడు వెంకటప్పడు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ యలమంచిలి సూర్యనారాయణల వైపు చూస్తూ.. ‘మీకు కూడా చెబుతున్నా..వాలంటీర్లంతా చురుకుగా ఉండాలి. మీ వర్గమైనా, మీ కులమైనా, చుట్టమైనా ఎవరైనా సరే..జగన్‌కి. పార్టీకి, నాకు అనుకూలమైన వాళ్లే ఉంటారు..లేనివాళ్లను పీకేస్తాం’ అని హెచ్చరించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వైపు చూస్తూ.. ‘ఏం.. సూర్యనారాయణ.. చప్పట్లు కొట్టమంటే కొట్టడం లేదు..జగన్‌ డబ్బులు వేశారన్నా చప్పట్లు రావడం లేదు.. అడిగి కొట్టించుకోవాల్సి వస్తుంది’ అని అసహనం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని