ఎన్నికల వేళ పురస్కారాల ఎత్తుగడ

పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని గత అయిదేళ్లుగా ప్రతిపక్ష నేతలు, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులతో తీవ్ర నిర్బంధాలు, అణిచివేత అమలుచేస్తున్న జగన్‌ ప్రభుత్వం ఎన్నికల వేళ ఆ పోలీసులను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు మరో ఎత్తుగడ వేసింది.

Published : 28 Mar 2024 05:06 IST

కోడ్‌ అమల్లో ఉండగా... పోలీసులకు డీజీపీ కమెండేషన్‌ డిస్క్‌ అవార్డులు

ఈనాడు, అమరావతి: పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని గత అయిదేళ్లుగా ప్రతిపక్ష నేతలు, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులతో తీవ్ర నిర్బంధాలు, అణిచివేత అమలుచేస్తున్న జగన్‌ ప్రభుత్వం ఎన్నికల వేళ ఆ పోలీసులను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు మరో ఎత్తుగడ వేసింది. రాష్ట్రంలోని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల నుంచి కిందిస్థాయిలో కానిస్టేబుళ్ల వరకూ వారి సేవలకు గుర్తింపుగా ఏటా ఇవ్వాల్సిన ‘డీజీపీ కమెండేషన్‌ డిస్క్‌’ పురస్కారాలను ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ప్రకటించింది. 2022 సంవత్సరం పురస్కారాలను ఇప్పుడు ఇచ్చింది. అదీ ఒకరికో, ఇద్దరికో కాదు... సీనియర్‌ ఐపీఎస్‌లైన ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు మొదలుకుని క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్ల వరకూ మొత్తం 474 మందికి ఈ పురస్కారాలిస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఈ నెల 26న ఆదేశాలు జారీ చేశారు. పోలీసు వ్యవస్థలోని అన్ని విభాగాల వారికీ జాబితాలో చోటు కల్పించారు. రెండేళ్లుగా ఇవ్వని పురస్కారాలను ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ప్రకటించటంలో ఆంతర్యమేంటి? ఇన్నాళ్లపాటు ఆ పోలీసుల సేవలు గుర్తుకు రాలేదా? ఎన్నికల వేళప్పుడే ఇవి గుర్తుకొచ్చాయా? కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఈ పురస్కారాలు ప్రకటించటం... ఉల్లంఘన కిందకే వస్తుందని, ఇది ఉద్యోగులను ప్రలోభపెట్టటం అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు