‘సాక్షి’ యాజమాన్యానికి సీఎం రమేష్‌ లీగల్‌ నోటీసు

‘సాక్షి’ టీవీ, పత్రిక యాజమాన్యానికి రాజ్యసభ సభ్యుడు, భాజపా అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్‌ లీగల్‌ నోటీసు పంపారు.

Published : 29 Mar 2024 03:36 IST

ఈనాడు, అమరావతి: ‘సాక్షి’ టీవీ, పత్రిక యాజమాన్యానికి రాజ్యసభ సభ్యుడు, భాజపా అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్‌ లీగల్‌ నోటీసు పంపారు. ఫోర్జరీ ఆరోపణలు సత్యదూరమని, ఉద్దేశపూర్వకంగా ‘సాక్షి’ మీడియాలో ఇటీవల తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశారని వెల్లడించారు. ఎన్నికల ముందు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు లీగల్‌ నోటీసులో సీఎం రమేష్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని