దేవాదాయశాఖ కమిషనర్‌పై సుమోటో కోర్టుధిక్కరణ కేసు

దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.

Published : 29 Mar 2024 03:47 IST

రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. తాను అర్హుడినైనా.. జూనియర్‌కు పదోన్నతి ఇచ్చారంటూ మురమళ్ల ఆలయ ఈవో లక్ష్మీనారాయణ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గతంలో తన సీనియారిటీని ఖరారు చేసిందని.. ఇప్పుడు తనకంటే జూనియర్‌కు పదోన్నతి ఇచ్చారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో పదోన్నతుల ఆదేశాల పత్రాలను తమముందు ఉంచాలని, సుమోటోగా కోర్టుధిక్కరణ కేసును పెండింగ్‌ వ్యాజ్యాలకు జతచేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అంతర్వేది ఆలయ సహాయ కమిషనర్‌ సత్యనారాయణ కూడా తన కంటే జూనియర్‌కు పదోన్నతి ఇచ్చారని హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఆదేశాల కాపీలనూ వారంలో తమముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. దేవాదాయశాఖలో వందమందికి పైగా ఇటీవల పదోన్నతులు ఇవ్వడంతో.. అర్హులై పదోన్నతి దక్కనివారు పెద్దసంఖ్యలో హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు