ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

Published : 29 Mar 2024 03:48 IST

సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు. ‘‘1987 బ్యాచ్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రామ్‌ మోహన్‌మిశ్రాను ప్రత్యేక జనరల్‌ పరిశీలకుడుగా, 1984 బ్యాచ్‌కు చెందిన విశ్రాంత ఐపీఎస్‌ అధికారి దీపక్‌మిశ్రాను ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా, 1983 బ్యాచ్‌కి చెందిన విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి నీనా నిగమ్‌ను ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా ఈసీ నియమించింది. ఈ ముగ్గురూ వచ్చే వారం నుంచి రాష్ట్రంలో పర్యటించి, ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఈసీ మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు చేయడం, రాష్ట్ర సరిహద్దు, సమస్యాత్మక ప్రాంతాలు, ఓటర్లకు తాయిలాల పంపిణీ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారిస్తారు’’ అని సీఈఓ మీనా గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని