సీఎం సభకు వచ్చినవారికి డబ్బుల పంపిణీ

సీఎం సభకు వచ్చినవారికి వైకాపా నాయకులు డబ్బులు పంపిణీ చేశారు. ఒక్కో బస్సుకు రూ.20వేల చొప్పున అందజేశారు. ఒక్కొక్కరికి రూ.300, మద్యం సీసా, బిర్యానీ అందించారు.

Updated : 30 Mar 2024 11:58 IST

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: సీఎం సభకు వచ్చినవారికి వైకాపా నాయకులు డబ్బులు పంపిణీ చేశారు. ఒక్కో బస్సుకు రూ.20వేల చొప్పున అందజేశారు. ఒక్కొక్కరికి రూ.300, మద్యం సీసా, బిర్యానీ అందించారు. బలవంతంగా సభ స్థలికి తీసుకొచ్చినా, అలా వచ్చిన ప్రజలు ఇలా తిరిగి వెళ్లిపోయారు. పట్టణంలో కొందరు వ్యక్తులు బహిరంగంగా నేతలు ప్రజలకు డబ్బులు పంపిణీ చేశారు. ఎమ్మిగనూరులో లక్ష్మీపేట, సంజీవ్‌నగర్‌, సోమప్పనగర్‌, రాఘవేంద్ర, మునెప్పనగర్‌, ఎస్సీ కాలనీ, ముగతిపేట, మల్లారవీధి, ఎన్టీఆర్‌ కాలనీ ప్రాంతాల్లో నేతలు టోకెన్లు ఇవ్వడంతో వారికీ డబ్బులు పంపిణీ చేశారు. ఈ సభకు వైకాపా వర్గీయులు రూ.కోట్లలో ఖర్చుచేసినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని