చెట్టు నుంచి జలధార

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కింటుకూరు అటవీ ప్రాంతంలో ఆసక్తికర అంశం వెలుగుచూసింది.

Updated : 31 Mar 2024 06:18 IST

దేవీపట్నం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కింటుకూరు అటవీ ప్రాంతంలో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. ఓ నల్ల మద్ది చెట్టు మొదలు వద్ద రంధ్రం చేయగా సుమారు పది లీటర్ల నీరు బయటకు వచ్చింది. జిల్లా అటవీశాఖాధికారి జి.జి.నరేంద్రియన్‌, ఇందుకూరు రేంజ్‌ అధికారి దుర్గాకుమార్‌, సిబ్బంది  కింటుకూరు అటవీ ప్రాంతంలో పర్యటించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాపికొండల నేషనల్‌ పార్కు పరిధిలో నల్ల మద్ది చెట్లు వేల సంఖ్యలో ఉన్నాయని, నీరు వచ్చే చెట్లు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయని రేంజర్‌ తెలిపారు. ఈ చెట్లు మొదలు భాగం నుంచి నాలుగు అడుగుల ఎత్తులో ఉబ్బినట్లు ఉంటాయని, వీటి నుంచి నీరు వస్తుందని చెప్పారు. కొన్ని చెట్లు వాటికి కావాల్సిన నీటిని భూమి నుంచి తీసుకుని కాండంలో నిల్వ ఉంచుకుంటాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని