విశాఖలో మూగజీవుల అక్రమ విక్రయాలు

వన్యప్రాణుల్ని అక్రమంగా క్రయవిక్రయాలు చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఆదివారం రాత్రి విశాఖలో చోటుచేసుకుంది.

Published : 01 Apr 2024 06:08 IST

నక్షత్ర తాబేళ్లు, నెమళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

విశాఖపట్నం (గోపాలపట్నం), న్యూస్‌టుడే: వన్యప్రాణుల్ని అక్రమంగా క్రయవిక్రయాలు చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఆదివారం రాత్రి విశాఖలో చోటుచేసుకుంది. టాస్క్‌ఫోర్స్‌, గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక సంతోష్‌నగర్‌కు చెందిన పిల్లా నాగేశ్వరరావు (35) గోపాలపట్నంలో పెంపుడు జంతువుల విక్రయ దుకాణం (పెట్‌ జోన్‌) నిర్వహిస్తున్నారు. ముందస్తు సమాచారంతో ఆయన నివాసంలో సోదాలు చేసిన పోలీసులు.. 15 నక్షత్ర తాబేళ్లు, రెండు నెమళ్లు, దుప్పి కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక ప్రాంతానికి చెందిన గొందేశి శ్రీనివాసరావు (42) నుంచి నక్షత్ర తాబేళ్లను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న జీవులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ప్రసాద్‌, సీఐ మల్లేశ్‌, ఎస్సై భరత్‌కుమార్‌, గోపాలపట్నం ఎస్సై అప్పలనాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని