దాహం తీర్చండి మహాప్రభో

అన్నమయ్య జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ప్రతి ఇంటికీ కుళాయి సౌకర్యం కల్పిస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడంతో గుక్కెడు నీటి కోసం వెతుకులాడాల్సిన దుస్థితి నెలకొంది.

Published : 02 Apr 2024 03:21 IST

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ వద్ద మహిళల ఆందోళన

రాయచోటి, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ప్రతి ఇంటికీ కుళాయి సౌకర్యం కల్పిస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడంతో గుక్కెడు నీటి కోసం వెతుకులాడాల్సిన దుస్థితి నెలకొంది. రాయచోటి మండలం కాటిమాయకుంట పంచాయతీ కురబపల్లి దళితవాడలో 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామంలోని చేతి పంపుల్లో నీరు రాకపోవడంతో పంట పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నామని పలువురు మహిళలు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ ఖాళీ బిందెలు చూపుతూ కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామానికి వచ్చే నేతలను ఈ విషయంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌కు వినతి అందజేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు