జాతీయస్థాయి క్విజ్‌ పోటీలకు ఇద్దరు కోదాడ విద్యార్థుల ఎంపిక

భారత ప్రభుత్వ క్రీడా ప్రాధికార సంస్థ(ఎస్‌ఏఐ), కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫిట్‌ ఇండియా క్విజ్‌ జాతీయస్థాయి పోటీలకు తమ విద్యార్థులు ఎంపికైనట్లు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన తేజ పాఠశాల ప్రిన్సిపల్‌ రమ, డైరెక్టర్‌ సోమిరెడ్డి తెలిపారు.

Published : 02 Apr 2024 05:21 IST

రాష్ట్రస్థాయి పోటీల్లో రూ.2.50 లక్షల బహుమతి కైవసం

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: భారత ప్రభుత్వ క్రీడా ప్రాధికార సంస్థ(ఎస్‌ఏఐ), కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫిట్‌ ఇండియా క్విజ్‌ జాతీయస్థాయి పోటీలకు తమ విద్యార్థులు ఎంపికైనట్లు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన తేజ పాఠశాల ప్రిన్సిపల్‌ రమ, డైరెక్టర్‌ సోమిరెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి సెమీ ఫైనల్‌, ఫైనల్‌ పోటీలను సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించగా పల్లా హృతిక్‌(పదో తరగతి), కొండ్ర నవీన్‌కుమార్‌(తొమ్మిదో తరగతి) 100 పాయింట్లతో విజేతగా నిలిచారన్నారు. ఈ మేరకు రూ.2.50 లక్షలు నగదు బహుమతి గెలుపొందారని చెప్పారు. అలాగే ఈ నెల చివరి వారంలో దిల్లీలో జరిగే జాతీయస్థాయి ఫైనల్స్‌లో తెలంగాణ రాష్ట్రం తరఫున వీరు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఫిట్‌ ఇండియా క్విజ్‌ పర్యవేక్షణకు కోదాడ వచ్చిన ఎస్‌ఏఐ కోచ్‌ శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ఈ పోటీల్లో హైదరాబాద్‌ జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ 30 పాయింట్లతో ద్వితీయ స్థానం, 20 పాయింట్లతో కెనడీ గ్లోబల్‌ స్కూల్‌ తృతీయ స్థానంలో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు