సీఎం ప్రత్యేక సీఎస్‌ పూనం మాలకొండయ్యకు నోటీసులు

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటులో అక్రమాలు, జాతీయ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధుల దుర్వినియోగం వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, సీఎం ప్రత్యేక సీఎస్‌ పూనం మాలకొండయ్య, మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో జితేందర్‌ శర్మలపై చర్యలను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది.

Updated : 04 Apr 2024 05:28 IST

మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో జితేందర్‌ శర్మకు కూడా..
ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో అక్రమాలపై హైకోర్టు విచారణ

ఈనాడు, అమరావతి: ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటులో అక్రమాలు, జాతీయ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధుల దుర్వినియోగం వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, సీఎం ప్రత్యేక సీఎస్‌ పూనం మాలకొండయ్య, మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో జితేందర్‌ శర్మలపై చర్యలను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. వారిద్దరికీ వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీలకూ నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు, ఎన్‌హెచ్‌ఎం నిధుల దుర్వినియోగం వ్యవహారంలో పూనం మాలకొండయ్య, జితేందర్‌ శర్మపై తదుపరి చర్యలను ఉపసంహరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 2021 అక్టోబర్‌ 4న ఇచ్చిన జీవో 1645ని సవాలు చేస్తూ విశాఖకు చెందిన ‘లీడర్‌’ దినపత్రిక ఎడిటర్‌ వి.వెంకటరమణమూర్తి హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీఎన్‌ నారాయణరావు వాదనలు వినిపించారు. కోట్ల రూపాయల జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులు  దుర్వినియోగమైనట్లు, ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటులో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు విజిలెన్స్‌ విచారణలో తేలిందన్నారు. పూనం మాలకొండయ్య, జితేందర్‌ శర్మలపై చర్యలను ఉపసంహరిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని