ఇసుక తవ్వకాలకు నిండు ప్రాణం బలి

వైకాపా నేతల అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అయ్యపరెడ్డిపాళెం గ్రామానికి చెందిన దశయ్య మంగళవారం ఉదయం పశువులను మేపేందుకు స్వర్ణముఖి నదికి వెళ్లారు.

Published : 04 Apr 2024 04:14 IST

గుంతల్లో పడి మహిళ మృత్యువాత

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా నేతల అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అయ్యపరెడ్డిపాళెం గ్రామానికి చెందిన దశయ్య మంగళవారం ఉదయం పశువులను మేపేందుకు స్వర్ణముఖి నదికి వెళ్లారు. మధ్యాహ్నం ఆయన భార్య కయ్యాల మీరమ్మ(49) ఆహారం తీసుకుని భర్త వద్దకు బయలుదేరగా నదిలో నీళ్లున్న ఇసుక గుంతల్లో పడి మునిగిపోయారు. భార్య ఎంతకూ ఆహారం తీసుకుని రాకపోవడంతో దశయ్య తీవ్రంగా గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. రాత్రి 10 గంటల సమయంలో గుంతలో నుంచి మీరమ్మ మృతదేహం పైకి తేలింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్వర్ణముఖిలో అక్రమ తవ్వకాలు చేస్తూనే ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్జీటీ, కోర్టుల ఉత్తర్వులనూ వారు లెక్కచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని