ఉక్కు కీలక భవనాలు ప్రైవేటు చేతుల్లోకి!

విశాఖ స్టీల్‌ ప్లాంటుకు చెందిన ఉక్కు హౌస్‌, గంగవరం గెస్ట్‌హౌస్‌లను ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధమైంది.

Published : 04 Apr 2024 04:15 IST

30 ఏళ్ల లీజుకు ఉక్కు హౌస్‌, గంగవరం గెస్ట్‌హౌస్‌
ఆసక్తి వ్యక్తీకరణ కోరిన ఆర్‌ఐఎన్‌ఎల్‌

ఈనాడు- విశాఖపట్నం, న్యూస్‌టుడే- ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ ప్లాంటుకు చెందిన ఉక్కు హౌస్‌, గంగవరం గెస్ట్‌హౌస్‌లను ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నగరంలో రూ.1,600 కోట్ల విలువైన సుమారు 25 ఎకరాల ఉక్కు స్థలాల్ని అమ్మకానికి పెట్టారు. తాజాగా నిర్వహణ ఆదాయం నిమిత్తం ఉక్కు గెస్ట్‌హౌస్‌లను 30 ఏళ్లపాటు దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కట్టబెట్టేందుకు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) అడుగులు వేసింది.  116 అతిథిగృహాలు, విశాలమైన హాల్స్‌, రెస్టారెంట్‌ కలిగిన ఉక్కు హౌస్‌ను, 5 గదుల గంగవరం గెస్ట్‌హౌస్‌ను ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకునేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 15లోగా బిడ్లు దాఖలు చేయాలని లేఖలో పేర్కొంది. విదేశీ నిపుణులు ఉండేందుకు అనువుగా త్రీస్టార్‌ సౌకర్యాలతో ఉక్కు హౌస్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని నిర్వహణ ఆర్‌ఐఎన్‌ఎల్‌ చూస్తోంది. గంగవరం గెస్ట్‌హౌస్‌ మూతపడి ఉంది. దీన్ని తెరిపించి ప్రైవేటుకు ఇచ్చి ఆదాయం పొందాలని చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని