వృద్ధుల మరణాలపై వైకాపా దుష్ప్రచారం

పల్నాడు జిల్లా దుర్గి మండలం నెహ్రూనగర్‌ తండాకు చెందిన సాలిబాయి(70) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ రెండు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారని, పింఛన్‌ కోసం వెళుతూ గుండెపోటుతో చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దుర్గి ఎంపీడీవో గుప్తా తెలిపారు.

Published : 04 Apr 2024 05:24 IST

వాస్తవాలు వెల్లడించిన అధికారులు

దుర్గి, కాకినాడ కలెక్టరేట్‌ - న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా దుర్గి మండలం నెహ్రూనగర్‌ తండాకు చెందిన సాలిబాయి(70) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ రెండు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారని, పింఛన్‌ కోసం వెళుతూ గుండెపోటుతో చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దుర్గి ఎంపీడీవో గుప్తా తెలిపారు. వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం పింఛన్‌ కోసం కుటుంబ సభ్యుడితో కలిసి ద్విచక్ర వాహనంపై గ్రామ సచివాలయం వద్దకు వెళుతూ స్పృహ తప్పి మృతి చెందిందంటూ వైకాపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు వృద్ధురాలు అనారోగ్యంతో ఇంటి వద్దే చనిపోయారని నిర్ధరించారు. పింఛన్లకు సంబంధించి అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఏటిమొగ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు ఇంటి వద్ద మృతి చెందారు. అయితే ఆయన పింఛను కోసం వార్డు సచివాలయానికి వెళ్లి వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైకాపా ప్రచారం చేసింది. వాస్తవంగా ఆ వృద్ధుడు ఉదయం 9 గంటల ప్రాంతంలో వార్డు సచివాలయానికి వెళ్లగా.. సాయంత్రం రమ్మని చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటి వద్దే మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని