తప్పుడు పోస్టులు పెట్టొద్దు

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పోలీసులు పలువురికి నోటీసులు అందజేస్తున్నారు.

Published : 11 Apr 2024 04:40 IST

పలువురికి సైబర్‌ సెల్‌ నోటీసులు

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పోలీసులు పలువురికి నోటీసులు అందజేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల్లో ఉత్సాహంగా ఉండేవారు.. ఈ నోటీసులు అందుకుంటున్న వారిలో ఉన్నారు. రాష్ట్ర సైబర్‌ సెల్‌ విభాగం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని పోలీసు యంత్రాంగం మూడు రోజులుగా ఆయా స్టేషన్ల పరిధిలో కొంతమందిని గుర్తించి నోటీసు అందజేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం పరిధిలోని సుమారు 41 మందికి వీటిని అందజేశారు. వీరిలో తెదేపా నాయకులు, కార్యకర్తలే అధికంగా ఉండటం గమనార్హం. నోటీసులు అందుకున్న తెదేపా ఎస్సీ సెల్‌ కార్యదర్శి కండవల్లి లక్ష్మి, మాజీ కార్పొరేటర్‌ భర్త రాయుడు సతీష్‌లు మాట్లాడుతూ తాము ఇటీవల ఎటువంటి పోస్టులూ పెట్టలేదని, అయినా నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే తప్పుడు ప్రచారంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని