అంబటి మురళీ.. ఇది తగునా?

వైకాపా నేతల అహంకారానికి అద్దం పట్టే ఘటన గురువారం పొన్నూరులో జరిగింది. ఓ అనుచరుడు నాయకుడి చెప్పులకు కాపలా కాసి, వాటిని పట్టుకెళ్లి వేసుకునేందుకు అనువుగా పెట్టినా.. ఆ నేత ఏ మాత్రం వారించకపోవడం చర్చకు దారితీసింది.

Updated : 12 Apr 2024 08:57 IST

వైకాపా నేతల అహంకారానికి అద్దం పట్టే ఘటన గురువారం పొన్నూరులో జరిగింది. ఓ అనుచరుడు నాయకుడి చెప్పులకు కాపలా కాసి, వాటిని పట్టుకెళ్లి వేసుకునేందుకు అనువుగా పెట్టినా.. ఆ నేత ఏ మాత్రం వారించకపోవడం చర్చకు దారితీసింది. రంజాన్‌ సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరులోని ఈద్గా వద్దకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ వచ్చారు. మురళీకృష్ణ కారు దిగి చెప్పులు విడవగానే.. అదే కారులోంచి దిగిన ఓ అనుచరుడు ఆ పాదరక్షలను చేత్తో తీసి పక్కన పెట్టి, వాటికి కాపలాగా ఉండిపోయారు. మురళీకృష్ణ మాత్రం రెడ్‌కార్పెట్‌పై నడుచుకుంటూ వెళ్లారు. కొద్దిసేపటికి ఆయన తిరిగొస్తుండగా.. గమనించిన అనుచరుడు చెప్పులను పట్టుకెళ్లి నేత కాళ్ల ముందుపెట్టారు. ఇదేదో అతిగా ఉందని భావించిన మిగతా అనుచరులు ఆ దృశ్యాన్ని ఫొటో తీయకుండా చుట్టూ చేరి జాగ్రత్తపడ్డారు. అయినా కొందరు ఎవరికీ తెలియకుండా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

న్యూస్‌టుడే, పొన్నూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని