మీ స్మార్ట్‌ మీటర్లు మాకొద్దు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో వ్యవసాయ మోటార్లకు జగనన్న స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును రైతులు అడ్డుకున్నారు.

Published : 13 Apr 2024 04:32 IST

అనంతపురం జిల్లాలో అడ్డుకున్న రైతులు

ఉరవకొండ, వజ్రకరూరు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో వ్యవసాయ మోటార్లకు జగనన్న స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును రైతులు అడ్డుకున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా శుక్రవారం స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు పొలాలకు చేరుకొని మీటర్ల ఏర్పాటును అడ్డుకున్నారు. బిగించిన కొన్ని మీటర్లను తీయించేశారు. ఈ విధానాన్ని దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా, ఇక్కడ మాత్రం వైకాపా ప్రభుత్వం అమలు చేయడం దారుణమని రైతులు వాపోయారు. రైతుల నుంచి విద్యుత్తు బిల్లులు వసూలు చేయాలన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వారు ఆరోపించారు. 20 ఏళ్లుగా మీటర్లు లేకుండానే ఆయా ప్రభుత్వాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తే వైకాపా ప్రభుత్వం దానికి తూట్లు పొడిచేలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎటువంటి షరతులు, స్మార్ట్‌ మీటర్లు లేకుండానే వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్తు అందించాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని