విశాఖవాసులూ.. వీటికి సమాధానాలు తెలుసా?

‘విశాఖలో ప్రభుత్వ భూములను కబ్జా చేసింది ఎవరు? సిరిపురం కూడలిలో క్రిస్టియన్‌ ఆస్తులను కొట్టేసింది ఎవరు?’ అనే పలు ప్రశ్నలు శనివారం ఉదయం విశాఖ వాసులను ఆలోచనలో పడేశాయి.

Published : 14 Apr 2024 03:58 IST

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: ‘విశాఖలో ప్రభుత్వ భూములను కబ్జా చేసింది ఎవరు? సిరిపురం కూడలిలో క్రిస్టియన్‌ ఆస్తులను కొట్టేసింది ఎవరు?’ అనే పలు ప్రశ్నలు శనివారం ఉదయం విశాఖ వాసులను ఆలోచనలో పడేశాయి. ‘విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?’ అని ప్రశ్నిస్తూ స్థానిక ఎంవీపీ కాలనీ ఆర్టీసీ బస్‌ కాంప్లెక్సు కూడలిలో ఫ్లెక్సీలు వెలిశాయి. వరుసగా కట్టిన అయిదు ఫ్లెక్సీల్లో.. ఐపీఎస్‌, పోలీసు అధికారుల స్థలాలనూ కబ్జా చేసింది ఎవరు? శ్మశానాలకు కేటాయించిన భూములు, వృద్ధాశ్రమాలకు కేటాయించిన స్థలాలు కాజేసింది ఎవరని ముద్రించారు. ‘‘టీడీఆర్‌ బాండ్లను కొట్టేసింది ఎవరు?, కబ్జాల్లో తలదూర్చి సొంత కుటుంబానికీ రక్షణ కల్పించుకోలేని దుస్థితిలో ఉన్న ప్రజాప్రతినిధి ఎవరు’’ అని మొత్తం 7 ప్రశ్నలను సంధించారు. విశాఖ తూర్పు వైకాపా అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ లక్ష్యంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు