యానాదుల వేదన పట్టదా జగన్‌!

‘జగనన్న మీరు మాపై దయ ఉంచి మా కాలనీకి వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం’ అనే ప్లకార్డుతో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో సీఎం జగన్‌ బసచేసిన వసతి ప్రాంగణం ఎదుట నిరుపేదలైన 60 యానాది కుటుంబాలు శనివారం మూడు గంటలపాటు నిరీక్షించాయి.

Published : 14 Apr 2024 05:39 IST

ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఆందోళన

పెదకాకాని, న్యూస్‌టుడే: ‘జగనన్న మీరు మాపై దయ ఉంచి మా కాలనీకి వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం’ అనే ప్లకార్డుతో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో సీఎం జగన్‌ బసచేసిన వసతి ప్రాంగణం ఎదుట నిరుపేదలైన 60 యానాది కుటుంబాలు శనివారం మూడు గంటలపాటు నిరీక్షించాయి. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ భూమిలో వారు నివాసం ఉంటున్నారు. ఇప్పటికీ వారికి ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. పట్టాలూ ఇవ్వలేదు. సీఎం తమ గోడు వింటారని ఎంతో ఆశతో ఎదురు చూసినా.. తమకు నిరాశే మిగిలిందని వారు వాపోయారు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది తమ ప్లకార్డును లాక్కొని పక్కన పడేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచారం కోసం కొందరిని తన వద్దకు    పిలిపించుకొని సమస్యలు వింటున్న జగన్‌కు.. గూడు కోసం వచ్చిన తాము కనిపించలేదా అని వాపోయారు. చివరకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద తమ గోడు వెళ్లబుచ్చారు. యానాదులను తీసుకొని సోమవారం కార్యాలయానికి రావాలని స్థానిక నాయకుడికి ఆయన బాధ్యతలు అప్పగించారు. ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు’ అని చెప్పే సీఎంకు యానాదుల సమస్యలు పట్టవా అని పలువురు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని