ఈ ఎన్నికల్లో ఎన్డీయేకే మా మద్దతు

బీసీ, ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణకు, యువత, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతుగా ఉంటామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రకటించారు.

Published : 15 Apr 2024 04:41 IST

ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రకటన

గుంటూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: బీసీ, ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణకు, యువత, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతుగా ఉంటామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రకటించారు. గుంటూరులోని ఓ కన్వెన్షన్‌లో ఆ సంఘం రాష్ట్ర స్థాయి భవిష్యత్తు కార్యాచరణ సమావేశం ఆదివారం నిర్వహించారు. శంకరరావు మాట్లాడుతూ ‘అన్ని జిల్లాల బీసీ సంఘాల నాయకుల అభిప్రాయం మేరకు ఎన్డీయేకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నాం. నా బీసీ, ఎస్సీ, మైనారిటీలు అంటున్న జగన్‌.. వారి అభివృద్ధికి చేసిందేమీ లేదు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు, విధులు లేకుండా చేశారు. బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. అసెంబ్లీ, రాజ్యసభ సీట్లు ఇచ్చామని చెప్తున్నా.. వారు చట్టసభల్లో బీసీల గురించి ఏనాడైనా మాట్లాడారా’ అని ప్రశ్నించారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్‌ మాట్లాడుతూ ‘కూటమికి రాష్ట్ర కార్యవర్గం మద్దతివ్వాలన్న నిర్ణయానికి ఇక్కడ ఉన్న అన్ని బీసీ సంఘాలు కట్టుబడి ఉన్నాయి. విద్యార్థులు గంజాయికి అలవాటై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వారందరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కూటమికి మద్దతు ప్రకటించాం. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని మాటిచ్చిన జగన్‌.. ఎలా మాట తప్పారో చూశాం. వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. సమావేశంలో సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నిమ్మల శేషయ్య, ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, కోశాధికారి కన్నా మాస్టారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, సమన్వయకర్త బ్రహ్మానందశర్మ, ఉపాధ్యక్షులు, అన్ని జిల్లాల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని