కార్పొరేట్‌ విద్య అంటే ఇదేనా జగన్‌?

‘పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నాం’ సీఎం జగన్‌ తరచూ చెప్పే మాట. క్షేత్రస్థాయిలో బడుల స్థితి చూస్తే సీఎం మాటల్లో ఎంత డొల్ల తనం ఉందో అర్థం అవుతుంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో నేటికీ పాకల్లో పాఠశాలలు నడుస్తున్నాయి.

Published : 16 Apr 2024 06:08 IST

సాలూరు గ్రామీణం, మక్కువ, న్యూస్‌టుడే: ‘పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నాం’ సీఎం జగన్‌ తరచూ చెప్పే మాట. క్షేత్రస్థాయిలో బడుల స్థితి చూస్తే సీఎం మాటల్లో ఎంత డొల్ల తనం ఉందో అర్థం అవుతుంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో నేటికీ పాకల్లో పాఠశాలలు నడుస్తున్నాయి. బడుల బాగుకు ‘నాడు-నేడు’ అంటూ ఊదరగొట్టింది.. ఇంకా రేకుల షెడ్లలో పిల్లలను చదివించేందుకా.. అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.


పాకలో పాఠాలు..

సాలూరు మండలంలోని పట్టుచెన్నూరు పంచాయతీ నిమ్మలపాడులోని ప్రాథమిక పాఠశాల ఇది. గతంలో ఇది కోమటివలసలో ఉండేది. రెండేళ్ల క్రితమే మార్చారు. ఇప్పటికీ సొంత భవనం లేదు. అద్దె భవనాలు దొరకలేదని.. విద్యార్థుల తల్లిదండ్రులతోనే కర్రలతో ఇలా షెడ్డు వేయించారు. దీంట్లో ప్రస్తుతం 12 మందికి ఒకే ఒకరు బోధిస్తున్నారు.  


భయంతో బోధన..

ఇది మక్కువ మండలంలోని బాగుజోల గ్రామ ప్రాథమిక పాఠశాల. భవనం కూలిపోయే స్థితిలో ఉంది. ప్రత్యామ్నాయం లేక అందులోనే 9 మందికి  బోధిస్తున్నారు. లోపల పూర్తిగా దెబ్బతినడంతో వరండాలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులకు సాధారణ నిధులూ రాలేదని, ‘నాడు- నేడు’లోనూ పాఠశాల ఎంపిక కాలేదని ఉపాధ్యాయుడు బి.పోలినాయుడు తెలిపారు.


ఉప ముఖ్యమంత్రి పంచాయతీలో..

ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సొంత పంచాయతీ కోదు పెద్దవలస ప్రాథమిక పాఠశాల ఇది. భవనం శిథిలమవడంతో తొలగించారు. రెండేళ్ల క్రితం రెండో విడత ‘నాడు-నేడు’లో రూ.37 లక్షలు కేటాయించడంతో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకూ రూ.6 లక్షలే విడుదల కావడంతో పనులు  పునాదుల దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం 52 మంది విద్యార్థులకు రేకుల షెడ్డే దిక్కయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని