రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పైపైకి!

రాష్ట్రంలో రోజురోజుకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో 44.9, పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, వైయస్‌ఆర్‌ జిల్లాలోని సింహాద్రిపురంలో 44.3, అనకాపల్లి జిల్లా రావికమతం, విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం, తుమికాపల్లి, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో 44.1, కర్నూలు జిల్లా వగరూరులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Published : 18 Apr 2024 03:46 IST

16 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా నమోదు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో 44.9, పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, వైయస్‌ఆర్‌ జిల్లాలోని సింహాద్రిపురంలో 44.3, అనకాపల్లి జిల్లా రావికమతం, విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం, తుమికాపల్లి, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో 44.1, కర్నూలు జిల్లా వగరూరులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 16 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, నందిగామ, గన్నవరం, విశాఖపట్నం, కావలి, తుని, నంద్యాల తదితర ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాలులు, 125 మండలాల్లో వడగాలులు వీచాయి. గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

జిల్లాల వారీగా గురువారం తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న మండలాల సంఖ్య: విజయనగరం 22, పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 12, అనకాపల్లి 11, పల్నాడు 7, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, ఎన్టీఆర్‌ 2, తూర్పుగోదావరి 2.

జిల్లాల వారీగా వడగాలులు వీచే అవకాశమున్న మండలాల సంఖ్య: ప్రకాశం 24, ఏలూరు 19, తూర్పుగోదావరి 17, గుంటూరు 17, పల్నాడు 16, శ్రీకాకుళం 14, ఎన్టీఆర్‌ 14, కృష్ణా 13, కాకినాడ 12, బాపట్ల 12, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 11, అల్లూరి సీతారామరాజు 11, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ 7, తిరుపతి 7, అనకాపల్లి 6, విజయనగరం 5, విశాఖపట్నం 3, పశ్చిమగోదావరి 3, పార్వతీపురం మన్యం 1, నంద్యాల 1, వైయస్‌ఆర్‌ 1.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని