సీపీఎస్‌ రద్దుపై మాట దాటేసిన బొత్స

భోగాపురం ఎయిర్‌ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated : 19 Apr 2024 05:20 IST

భోగాపురం ఎయిర్‌పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని వెల్లడి

విశాఖపట్నం (పెదవాల్తేరు) న్యూస్‌టుడే : భోగాపురం ఎయిర్‌ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. విశాఖను ముంబయి తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబులా గ్రాఫిక్స్‌ చూపించబోమన్నారు. అయితే సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్‌ ఎందుకు మాటతప్పారని ప్రశ్నించగా.. మద్యం ధరలు పెంచింది నియంత్రణ కోసమే అన్నారు. సీపీఎస్‌ విధానం రద్దుచేస్తామని చెప్పారు. ఎందుకు చేయలేదని? అడిగిన ప్రశ్నకు ఆయన మాట దాటేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని