చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్‌ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు

Published : 19 Apr 2024 04:18 IST

ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బంది ఎదురుచూపులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్‌ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో అనుబంధ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రలుగా రెండు వేల మంది తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగానే వీరికి వేతనాలు నిలిచాయి. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున చెల్లించేందుకు కూడా ట్రస్టు వద్ద నిధులు లేకపోవడం గమనార్హం. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందజేసిన చికిత్సల నిమిత్తం అనుబంధ ఆసుపత్రుల యాజమాన్యాలకు బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. వైకాపా ప్రభుత్వంలో ఈ జాప్యం షరామామూలుగా మారింది. 108 (అంబులెన్స్‌), 104 (ఫ్యామిలీ ఫిజిషియన్‌) సర్వీసుల కింద సుమారు 5వేల మంది పనిచేస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్సుల డ్రైవర్లలో కొందరికి కూడా ఇప్పటివరకు మార్చి నెల వేతనాలు అందలేదు. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులది కూడా ఇదే పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని