సీజేను కలిసిన బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌

ఏపీ న్యాయవాద మండలి (బార్‌ కౌన్సిల్‌) ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్‌ సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 19 Apr 2024 04:35 IST

ఈనాడు, అమరావతి: ఏపీ న్యాయవాద మండలి (బార్‌ కౌన్సిల్‌) ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్‌ సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేను శాలువాతో సత్కరించారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికయిన సందర్భంగా వారిరువురినీ సీజే అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని