చంద్రబాబుకు కేంద్రమంత్రి గడ్కరీ శుభాకాంక్షలు

తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో పాటు కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ప్రభు, భాజపా నేత మురళీధర్‌రావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 21 Apr 2024 05:32 IST

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో పాటు కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ప్రభు, భాజపా నేత మురళీధర్‌రావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

  • చంద్రబాబునాయుడి జన్మదిన వేడుకలను మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ దిల్లీలోని తన నివాసంలో నిర్వహించారు. ఆయన తెదేపా అభిమానులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై చంద్రబాబునాయుడు చెరగని ముద్ర వేశారన్నారు.
  • చంద్రబాబు నాయకత్వంలో ఏపీ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని లోకేశ్‌ అభిలషించారు. ‘హ్యాపీ బర్త్‌డే బాబు’ హ్యాష్‌ట్యాగ్‌ ఎక్స్‌ టాప్‌-1లో శనివారం కొంతసేపు ట్రెండ్‌ అయ్యింది.
  • తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్ని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఎన్నారై తెదేపా గల్ఫ్‌ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, శేషుబాబు, కోడూరి వెంకట్‌ తదితరులు కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బుచ్చిరాంప్రసాద్‌, చలసాని కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.
  •  తెదేపా న్యాయ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు.
  •  ‘నా రాజకీయ గురువు చంద్రబాబే. అందులో ఏ మాత్రం సందేహం లేదు’ అని కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ భాజపా అభ్యర్థి సుజనాచౌదరి ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని