గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్‌

గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నిందితుడు సతీష్‌ కుమార్‌ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 23 Apr 2024 08:10 IST

ఈనాడు, అమరావతి: గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నిందితుడు సతీష్‌ కుమార్‌ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కుట్రకోణంపై నిందితుణ్ని మరింత లోతుగా విచారించాల్సి ఉందని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును కోరారు. బాధితుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినందున.. ఈ ఘటనలో కుట్రకోణాన్ని వెలికితీయాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఏడు రోజుల కస్టడీకి అనుమతివ్వాలని కోరారు. న్యాయాధికారి రమణారెడ్డి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

వాంగ్మూలం నమోదు పిటిషన్‌పై 29న వాదనలు

నిందితుడి వాంగ్మూలాన్ని 164 సీఆర్పీసీ కింద నమోదు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌.. సోమవారం నాలుగో ఏసీఎంఎం కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తీవ్రత, తదుపరి దర్యాప్తు దృష్ట్యా సతీష్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని పిటిషన్‌లో కోరారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు నిందితుడి తరఫు న్యాయవాది సలీం సమయం కోరారు. దీనిపై న్యాయాధికారి రామ్మోహన్‌ స్పందిస్తూ ఈనెల 29కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని