పోలింగ్‌ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్‌ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు.

Updated : 23 Apr 2024 06:56 IST

సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్‌ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండి మళ్లీ ఇక్కడ వినియోగించుకోవాలనుకునే వారిని నియంత్రిస్తామన్నారు. ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలి. ఏపీతో సరిహద్దు పంచుకునే తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల తనిఖీ కేంద్రాల వద్ద నిఘా పెంచుతాం. రాష్ట్రానికి వచ్చే ప్రతీ వాహనాన్ని నిశితంగా పరిశీలించాకే రాష్ట్రంలోకి అనుమతిస్తాం’ అని మీనా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని