మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.

Published : 25 Apr 2024 05:47 IST

గాంధీ విగ్రహంపైకి చెప్పులతో ఎక్కిన వైకాపా కార్యకర్తలు

నందిగామ, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి ర్యాలీ, సభ నిర్వహించారు. వైకాపా జెండాలు పట్టుకొని గాంధీ విగ్రహంపైకి చెప్పులతో ఎక్కారు. విగ్రహంపై కూర్చున్నారు. నానా యాగీ చేశారు. అక్కడే ఏసీపీ రవికిరణ్‌, సీఐ, ఎస్సైలు ఉన్నా పట్టించుకోలేదు. బాణసంచాలు, డీజేలతో హోరెత్తించారు. పార్టీ జెండాలు కట్టిన వాహనాలను పురపాలక సంఘ కార్యాలయం ప్రాంగణంలో నిలిపారు. కార్యకర్తలు గోడ దూకి ఆర్డీవో కార్యాలయంలోకి ప్రవేశించారు. ఫిర్యాదులు రావడంతో చివరికి అధికారులు డీజే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని