నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు

రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి.

Published : 25 Apr 2024 05:48 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లా తుమికాపల్లిలో 45, వైయస్‌ఆర్‌ జిల్లా బలపనూరులో 44.9, ప్రకాశం జిల్లా దొనకొండలో 44.3, నంద్యాల జిల్లా మహానందిలో 44.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.1, ఎన్టీఆర్‌ జిల్లా కంభంపాడు, పల్నాడు జిల్లా రావిపాడులలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం 54 మండలాల్లో తీవ్ర వడగాలులు  వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

గురువారం తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు: విజయనగరం- 23, శ్రీకాకుళం- 13, పార్వతీపురం మన్యం- 12, అనకాపల్లి- 3, అల్లూరి సీతారామరాజు- 2, విశాఖ- 1.

గురువారం వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు: తూర్పుగోదావరి- 19, కాకినాడ- 17, శ్రీకాకుళం- 15, అనకాపల్లి- 15, ఏలూరు- 14, గుంటూరు- 14, అల్లూరి సీతారామరాజు- 12, కృష్ణా- 9, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ- 9.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు