ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!

జగన్‌ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి.

Updated : 28 Apr 2024 07:45 IST

న్యూస్‌టుడే, ఎలమంచిలి: జగన్‌ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. మండు వేసవిలో తరచూ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతతో అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ఆసుపత్రిలో ఒక వార్డులో కు.ని.శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, బాలింతలు, మహిళా రోగులు.. మరోదాంట్లో డయేరియా రోగులను ఉంచారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోతే అంధకారంలో విసనకర్రలతో ఉపశమనం పొందాల్సిందే. ఇన్వర్టర్‌ ఉన్నా ఒక్క వార్డులో లైట్లకే అది పరిమితమైంది. గంట దాటితే ఆ ఇన్వర్టరూ పనిచేయదు. ఆసుపత్రికి 2 జనరేటర్లు ఉన్నా ఇంధన బడ్జెట్‌ లేక మూలకేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు