సుందరనాయుడి సేవలు నిరుపమానం

అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్‌ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు.

Updated : 29 Apr 2024 06:23 IST

చిత్తూరు పెద్దాయనకు కోళ్ల రైతుల నివాళి

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్‌ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. సుందరనాయుడు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆదివారం చిత్తూరు రామ్‌నగర్‌ కాలనీలోని నెక్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

పెద్దాయన మనవడు, బాలాజీ హేచరీస్‌ డైరెక్టర్‌ ప్రణీత్‌, నెక్‌ జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు రమేష్‌బాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోళ్ల పరిశ్రమకు సుందరనాయుడు చేసిన సేవలు మరువలేనివన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా కోళ్ల పరిశ్రమను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైతుల బాగు కోసం ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఏటా జులై 1న సుందరనాయుడు జయంతి, ఏప్రిల్‌ 28న వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నెక్‌ చిత్తూరు జోనల్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులు నాయుడు, జగదీశ్‌, బాలాజీ హేచరీస్‌ జీఎం రాజేంద్ర, కోళ్ల రైతులు సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యంరెడ్డి, గోపాల్‌, తుకారాం, రవికుమార్‌, కన్నయ్య, మహదేవ్‌, చైతన్య, లోకేష్‌, కృష్ణారెడ్డి, జయరాం నాయుడు, విక్రమ్‌, వేణు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని