లండన్‌ బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌

కుటుంబసభ్యులతో... సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి విహారయాత్ర కోసం లండన్‌ బయల్దేరి వెళ్లారు.

Updated : 18 May 2024 10:26 IST

విమానాశ్రయంలో సీఎం జగన్‌కు వీడ్కోలు పలుకుతున్న మంత్రులు, నేతలు

ఈనాడు, అమరావతి: కుటుంబసభ్యులతో... సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి విహారయాత్ర కోసం లండన్‌ బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేశ్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ తదితర నేతలు వీడ్కోలు పలికారు. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని