కలెక్టర్, ఎస్పీల నియామకంపై ఈసీకి అధికారుల జాబితా

కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ చేసిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్‌ల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి కొందరు అధికారుల పేర్లతో ఈసీకి జాబితాలు పంపించారు.

Published : 18 May 2024 03:43 IST

ఈనాడు, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ చేసిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్‌ల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి కొందరు అధికారుల పేర్లతో ఈసీకి జాబితాలు పంపించారు. పల్నాడు కలెక్టర్‌ పోస్టుకు లట్కర్‌ శ్రీకేశ్‌ బాలాజీరావు, హరికిరణ్, వీరపాండ్యన్‌ల పేర్లు సూచించారు. ముగ్గురు ఎస్పీల కోసం తొమ్మిది పేర్లు పంపించాల్సి ఉండగా.. ఐదుగురి పేర్లు పంపించారు. వారిలో మల్లికాగర్గ్, గౌతమిషాలి, హర్షవర్ధన్‌రాజు, కె.శ్రీనివాసరావు, డి.నరసింహకిశోర్‌ల పేర్లు ఉన్నాయి. ఈసీ ఆదేశాల మేరకు పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందుమాధవ్, అమిత్‌ బర్దర్‌లను సస్పెండ్‌ చేస్తూ, పల్నాడు కలెక్టర్‌ శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని