రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated : 18 May 2024 06:29 IST

అన్నవరం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు ఈ కల్యాణ తంతు ఉంటుంది. 18న స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరిస్తారు. 19న కల్యాణం, 20న అరుంధతి నక్షత్ర దర్శనం, రావణ బ్రహ్మ వాహన సేవ, 21న పండిత సదస్యం, పొన్న వాహన సేవ, 22న వనవిహారోత్సవం, రథోత్సవం జరగనున్నాయి. ఈ ఏడాది రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం 34.1 అడుగుల ఎత్తుతో భారీ రథాన్ని రూ.1.08 కోట్లతో తయారు చేయించారు. 22న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. 23న శ్రీ చక్రస్నానం, 24న శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఈవో కె. రామచంద్రమోహన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు