రెండో రోజు ఏపీఈఏపీసెట్‌కు 91.62 శాతం మంది హాజరు

జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్‌లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్‌ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్‌.ప్రసాదరాజు తెలిపారు.

Updated : 18 May 2024 05:16 IST

గాంధీనగర్, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్‌లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్‌ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్‌.ప్రసాదరాజు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షకు శుక్రవారం ఉదయం 22,221 మంది విద్యార్థులకు.. 20,226మంది హాజరైనట్లు సెట్‌ కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్నం 22,400 మందికి.. 20,654 మంది పరీక్ష రాశారని వివరించారు. మొత్తంగా 44,621 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 40,880 మందిరాశారని.. ఇది 91.62 శాతంగా నమోదైందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని