అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు.

Published : 20 May 2024 04:33 IST

కప్పస్తంభం వద్ద జస్టిస్‌ సందీప్‌ మెహతా దంపతులు

సింహాచలం, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడామండపం చుట్టూ ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. న్యాయమూర్తి దంపతులకు.. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని