భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన సీఎస్‌

విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు.

Published : 21 May 2024 02:54 IST

సీఎస్‌ జవహర్‌రెడ్డికి పనుల వివరాలను తెలుపుతున్న జీఎంఆర్‌ ప్రతినిధులు 

భోగాపురం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన విమానాశ్రయ పనులను పరిశీలించారు. టెర్మినల్‌ భవనంతో పాటు, రన్‌వే, ఏటీసీ కేంద్రాలు, ఇతర నిర్మాణాలను చూశారు. విమానాశ్రయానికి అవసరమైన భూములతో పాటు, ప్రహరీ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. జీఎంఆర్‌ ప్రతినిధులతో సమీక్షించారు. జేసీ కె.కార్తీక్, ఆర్డీవో ఎం.వి.సూర్యకళ, తహసీల్దార్‌ శ్యాంప్రసాద్, జీఎంఆర్‌ సీఈవో మనోమయ్‌రాయ్, ప్రాజెక్ట్‌ ప్రధాన అధికారి బీహెచ్‌ రామరాజు ఉన్నారు. సీఎస్‌ వస్తున్న సమాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని