గుంటూరు పశ్చిమలో.. పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సులకు సీలు వేయని అధికారులు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Published : 21 May 2024 05:34 IST

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా గుంటూరు పశ్చిమలోనే అత్యధికంగా పోస్టల్‌ బ్యాలట్లు నమోదయ్యాయి. 4,126 మంది ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోగా.. మొత్తం 12 పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సులు ఏర్పాటుచేశారు. భద్రతా కారణాలతో స్ట్రాంగ్‌రూంను మార్చే క్రమంలో కొన్ని పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సులకు తాళాలు, మరికొన్నింటికి సీలు వేయని విషయాన్ని తెదేపా నాయకులు గుర్తించారు. వెంటనే ఎన్నికల అధికారులను నిలదీయడంతో అప్పటికప్పుడు సీలు వేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెదేపా నేతలు చెప్పారు.

న్యూస్‌టుడే, గుంటూరు (పట్టాభిపురం) 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు