ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స

ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Published : 21 May 2024 03:02 IST

ఈనాడు, అమరావతి: ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ‘ఈనాడు’లో సోమవారం ప్రచురితమైన ‘విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట’ కథనానికి వివరణ ఇచ్చారు. పాఠశాలలతో సంబంధం లేకుండా ‘అమ్మఒడి’ కింద విద్యార్థులందరికీ రూ.15వేల ఆర్థికసాయం అందిస్తున్నామని.. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటులో 25% సీట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు విద్యాకానుక, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్, ట్యాబ్‌లు అందిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక, సెకండరీ స్థాయిలో వందశాతం.. హయ్యర్‌ సెకండరీలో 74.87% స్థూల ప్రవేశాల నిష్పత్తి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని