ఈవీఎంల ధ్వంసం ఘటనలపై ఎస్పీ ఆరా

పోలింగ్‌ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలపై పల్నాడు ఎస్పీ మలికాగార్గ్‌ ఆరా తీశారు. మంగళవారం ఆమె రెంటచింతల మండలం పాల్వాయిగేటు, తుమృకోట గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

Published : 22 May 2024 03:35 IST

పాల్వాయిగేటు, తుమృకోట పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రాన్ని  పరిశీలిస్తున్న ఎస్పీ మలికాగార్గ్‌

రెంటచింతల, న్యూస్‌టుడే: పోలింగ్‌ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలపై పల్నాడు ఎస్పీ మలికాగార్గ్‌ ఆరా తీశారు. మంగళవారం ఆమె రెంటచింతల మండలం పాల్వాయిగేటు, తుమృకోట గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పాల్వాయిగేటు కేంద్రంలోని ఈవీఎంను వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎస్పీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రోజు జరిగిన ఘటనల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ రెండు గ్రామాల్లో పికెట్‌ నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. ఏ చిన్న అలజడి జరిగినా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ వెంట గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సీఐ నారాయణస్వామి, ఎస్సై ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు