తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక రచనా అతిథిగృహం వద్ద రేవంత్‌రెడ్డికి తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Updated : 22 May 2024 06:22 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక రచనా అతిథిగృహం వద్ద రేవంత్‌రెడ్డికి తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తితిదే తరఫున అధికారులు బస ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సీఎం బుధవారం ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లిస్తారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని